ఉమెన్స్ డే స్పెషల్.. 27 మందికి మహిళా పురస్కారాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగాల్లో మెరుగైన సేవలు అందించిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగాల్లో మెరుగైన సేవలు అందించిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన మొత్తం 27 మందిని ఎంపిక చేస్తూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పురస్కారాలకు ఎంపికైన వారికి ప్రభుత్వం రూ.లక్ష నగదు పారితోషికం, జ్ఞాపిక అందజేయనున్నట్లు తెలిపారు.
పురస్కారానికి ఎంపికైనా వారిలో ఏఎన్‌ఎం ఇందిర, ఆశా కార్యకర్త ఎం కృష్ణవేణి, కమ్యూనిటీ మొబిలైజేషన్ సామల శ్వేత, సోషల్ సర్వీస్ ఆల్ఫి కిడన్‌జెన్, థియేటర్ ఆర్ట్స్ సుజాత దీక్షిత్, మహిళా పారిశ్రామికవేత్త సమంతారెడ్డి, వైద్యం డాక్టర్ అమూల్య మల్లన్నగారి, సంగీతం ఓఎన్‌ఐ సిస్టర్స్ (వినోద, విజయ, విజయలక్ష్మి), కిన్నెర వాయిద్యం రంగంలో కర్నె శంకరమ్మ తదితరులు ఉన్నారు. కాగా, పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతీ రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు.