బ్రేకింగ్: ఈ నెల 16న Palamuru - Ranga Reddy ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
దిశ, వెబ్‌డెస్క్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కాగా, ప్రపంచంలోనే భారీ పంపులతో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతలకు సిద్ధమైంది. వెట్ రన్ సందర్భంగా 2 కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని మోటర్లు ఎత్తిపోయనున్నాయి. ప్రాజెక్ట్ వెట్ రన్ ప్రారంభోత్సవ సందర్భంగా సీఎం కేసీఆర్ కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అదే రోజు ప్రభుత్వం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. ఈ సభలో కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ సభకు పాలమూరు- రంగారెడ్డి జిల్లాలలోని పల్లె పల్లె నుంచి ప్రజలు, గ్రామ సర్పంచులు హాజరయ్యేలాగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. 16వ తేదీ ప్రారంభోత్సం తర్వాత ఈనెల 17న ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని ప్రతీ గ్రామంలో దేవుళ్ళ పాదాలకు గ్రామ సర్పంచులు, ప్రజలు అభిషేకం చేయనున్నారు.