కొత్త మెడికల్ కాలేజీల్లో పాత స్టాఫ్.. కేంద్రానికి డాక్టర్ల ఫిర్యాదు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్టంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం పూర్తి స్థాయి స్టాఫ్‌ను రిక్రూట్చేయలేదు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్టంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం పూర్తి స్థాయి స్టాఫ్‌ను రిక్రూట్చేయలేదు. కొన్నింటిలో కాంట్రాక్ట్విధానంలో భర్తీ చేసింది. నేషనల్మెడికల్కమిషన్తనిఖీల సమయంలో మాత్రం పాత కాలేజీల స్టాఫ్‌ను సర్దుబాటు చేసినట్లు తెలిసింది. కొన్ని చోట్ల పాత కాలేజీల నుంచి కొత్త కళాశాలలకు డిప్యుటేషన్లపై పంపించారు. అర్హత కలిగిన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్స్టాఫ్ఉన్నా వారిని కొత్త కాలేజీలకు తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు కొందరు డాక్టర్లు సిద్ధమయ్యారు.
ఎంక్వైరీ చేస్తే?
డాక్టర్ల ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎన్‌ఎంసీ ఎంక్వైరీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం బయటపడుతుంది. ఎన్‌ఎంసీ చాలా సీరియస్యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త మెడికల్‌కాలేజీలకు అనుమతులొచ్చే అవకాశం కూడా తక్కువే ఉంటుంది. అదే విధంగా జిల్లాకో మెడికల్‌కాలేజీ ఆశ కూడా అడియాశలయ్యే ప్రమాదం ఉన్నది.