Telangana Polling: ఓటు వేసేందుకు ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చిన వృద్దులు.. ఇది కదా బాధ్యత అంటే..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగిపోతుంది.
దిశ,వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సినీ రాజకీయ ప్రముఖులు, అధికారులు ఇచ్చిన పిలుపుతో.. ఓటర్లు పోటెత్తారు. అయితే.. అనారోగ్యంగా ఉన్న వాళ్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు.. పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. కొందరు ఆక్సీజన్ సిలిండర్లతో సహా.. ఓటు వేసేందుకు రావటం విశేషం.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన 75 ఏళ్ల శేషయ్య అనే ఓటరు.. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే.. శేషయ్య కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అయితే.. శేషయ్య ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు పోలింగ్ కేంద్రానికి రావటం.. ఆసక్తికరంగా ఉన్నా.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే.. అంతా బాగుండి కూడా బద్ధకంతో చాలా మంది ఓటు హక్కును వినియోగించకుండా ఉంటున్న సమయంలో.. ఇలా బెడ్‌కే పరిమితమైన వాళ్లు కూడా ఆక్సిజన్ సిలిండర్లతో వచ్చి ఓటేయటం చాలా మందికి కనువిప్పు కలిగిస్తోంది. పౌరుడిగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇలాంటి వాళ్లు మరోసారి తమ ఓటుతో చెప్తున్నారు.