ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టిన అధికారులు

ధర్మపురి ఎన్నికల వివాదం మరోసారి ఉత్కంఠత రేపుతోంది. హైకోర్టు ఆదేశాలతో ఆదివారం ఉదయం ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలను అధికారులు పగులగొట్టారు.

Update: 2023-04-23 05:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ధర్మపురి ఎన్నికల వివాదం మరోసారి ఉత్కంఠత రేపుతోంది. హైకోర్టు ఆదేశాలతో ఆదివారం ఉదయం ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలను అధికారులు పగులగొట్టారు. అనంతరం కీలక పత్రాలు స్వాధీనం చేసుకొని నివేదికలను హైకోర్టుకు సమర్పించనున్నారు. నివేదికలో 17సీ ఫామ్ అత్యంత కీలకం కానుంది. కాగా, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు, ఇతర డాక్యుమెంట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సీల్‌ను అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో పగులగొట్టాలని హైకోర్టు జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.

దీని కోసం వడ్రంగి సాయం తీసుకోవాలని కూడా కోర్టు సూచించింది. బీఆర్‌ఎస్ (ఆ సమయంలో టీఆర్ఎస్) అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గంలోని కొన్నిచోట్ల ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు, రీకౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని 2019లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అప్పటి నుంచి పలు దఫాలుగా ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇవాళ స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగుల గొట్టిన అధికారులు తుది నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు.

Tags:    

Similar News