మందుబాబులకు బిగ్ షాక్.. త్వరలో పెరగనున్న రేట్లు..?
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో మద్యం ప్రియులకు త్వరలో షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో మద్యం ప్రియులకు త్వరలో షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణతో పోలిస్తే పక్క రాష్ట్రాల్లో ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ అమ్మకాలు తగ్గకపోవడం వల్ల.. తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం ధరల(Alcohol prices) పెంపు కి కసరత్తు ప్రారంబించారని.. దీనికి సంబంధించి.. ప్రతిపాదనలు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై పలు మార్లు చర్చించారని.. ఇందులో భాగంగా.. బీర్ల పై రూ. 15 నుంచి 20 మధ్య, అలాగే క్వార్టర్ల బ్రాండ్లను బ్టి.. రూ. 10 నుంచి రూ. 80 వరకు పెంచాలని ప్రతిపాధించారని.. ఈ నిర్ణయంతో.. సగటున రాష్ట్రంలో 20-25 శాతం వరకు ధరలు పెంచి నెలకు రూ. 500 కోట్ల నుంచి రూ. 700 కోట్ల అదనపు ఆదాయం పొందాలని ప్రభుత్వం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ మద్యం ధరల పెంపుపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేదు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే.. ప్రభుత్వం, కానీ అధికారులు కానీ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.