KTRకు భారీ షాక్.. రాజ్ పాకాల ఫామ్‌హౌజ్ అక్రమ కట్టడంగా తేల్చిన అధికారులు!
జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కేటీఆర్‌కు, ఆయన బావమరిది రాజ్‌పాకాలకు అధికారులు భారీ షాకిచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కేటీఆర్‌కు, ఆయన బావమరిది రాజ్‌పాకాలకు అధికారులు భారీ షాకిచ్చారు. ఫామ్ హౌస్‌లో అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడంపై ఇప్పటికే ఒకపక్క దర్యాప్తు కొనసాగుతుండగా.. ఇప్పుడు ఏకంగా ఆ ఫామ్ హౌస్ పూర్తిగా అక్రమ కట్టడమని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు పెద్ద షాక్ అనే ప్రచారం సాగుతోంది. అర్థరాత్రి వేళ పార్టీ నిర్వహించడంపై దర్యాప్తు మొదలైన సందర్భంలో అది ఫామ్‌హౌజ్ కాదని, తన బావమరిది సొంతిల్లు అని కేటీఆర్ మీడియా ముందే చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అధికారులు ఆ ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తేల్చడంతో రాజ్ పాకాలతో పాటు కేటీఆర్ కూడా చిక్కుల్లో పడ్డట్లైంది.
కాగా.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ వివరాలన్నీ ఆర్టీఐ దరఖాస్తుతో బయటపడ్డట్లు సమాచారం. ఇక బిల్డింగ్ నిర్మిస్తున్నప్పుడే జులై 6, 2022; జనవరి 30 2023; ఫిబ్రవరి 8 2023న నోటీసులు ఇచ్చామని అక్రమ కట్టడమంటూ నోటీసులు ఇచ్చామని చెబుతున్న పంచాయతీ కార్యదర్శి.. వాటిలో ఒక్క నోటీసుకు కూడా పాకాల రాజు స్పందించలేదని చెప్పినట్లు తెలుస్తోంది.