స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు.. బస్సుల ఫిట్​నెస్‌పై ఆరా!

సైబరాబాద్​మహిళా, శిశు రక్షణా విభాగానికి చెందిన అధికారులు శుక్రవారం ట్రాఫిక్​అధికారులతో కలిసి కమిషనరేట్​పరిధిలోని వేర్వేరు పాఠశాలల్లో నడుపుతున్న స్కూల్​బస్సులను ఆకస్మిక తనిఖీ చేశారు.

Update: 2023-09-22 14:57 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సైబరాబాద్​మహిళా, శిశు రక్షణా విభాగానికి చెందిన అధికారులు శుక్రవారం ట్రాఫిక్​అధికారులతో కలిసి కమిషనరేట్​పరిధిలోని వేర్వేరు పాఠశాలల్లో నడుపుతున్న స్కూల్​బస్సులను ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్​బస్సులు పూర్తి ఫిట్​నెస్‌తో ఉన్నాయా? అర్హులైన వారే డ్రైవర్లుగా పని చేస్తున్నారా? అన్న అంశాలపై విచారణ జరిపారు. దాంతోపాటు ఆయా స్కూల్​బస్సులకు చెందిన డాక్యుమెంట్లను పరిశీలించారు. కమిషనరేట్​పరిధిలోని పలు ఇంటర్నేషనల్​స్కూళ్లలో నడుపుతున్న బస్సుల ఫిట్​నెస్‌పై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఉమెన్​అండ్​చైల్డ్​సెక్యూరిటీ వింగ్​డీసీపీ నితికా పంత్​నేతృత్వంలో వేర్వేరు బృందాలుగా ఏర్పడ్డ అధికారులు వేర్వేరు స్కూళ్లలో తనిఖీలు జరిపారు. ఆయా స్కూల్​బస్సులపై స్కూల్​డ్యూటీ అనే స్టిక్కర్లు అతికించారా? లేదా? అన్నది పరిశీలించారు.

దాంతోపాటు స్కూల్​కాంటాక్ట్​నెంబర్‌ను బస్సుపై రాశారా? బస్సుల లోపల ఫస్ట్​ఎయిడ్​కిట్లు ఉన్నాయా? అన్నది చూశారు. అనుకోకుండా అగ్నిప్రమాదం సంభవిస్తే మంటలు ఆర్పడానికి ఫైర్​ఎస్టింగ్విషర్లు ఉన్నాయా? లేదా? అన్నది పరిశీలించారు. దాంతోపాటు బస్సు లోపల కెమెరాలను ఏర్పాటు చేశారా? అన్న దానిపై ప్రశ్నించారు. డ్రైవర్లకు లైసెన్సులు ఉన్నాయా? ట్రాఫిక్​నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారా? పాల్పడితే ఎన్ని కేసులు నమోదై ఉన్నాయన్న దానిపై విచారణ చేశారు. రెండుకు మించి కేసులు ఉంటే అలాంటి డ్రైవర్లు స్కూల్​బస్సులు నడపటానికి అనర్హులని స్పష్టం చేశారు. ఇక, డ్రైవర్లలో ఎవరికైనా నేర చరిత్ర ఉందా? అనే దానిపై కూడా ఆరా తీశారు. దీనికోసం పపిలియన్​డివైస్‌లో డ్రైవర్ల వేలిముద్రలను సేకరించారు. వీటి ఆధారంగా డ్రైవర్లలో ఎవరెవరి పైనా కేసులు ఉన్నాయన్న దానిపై విచారణ చేయనున్నట్టు డీసీపీ నితికా పంత్​తెలియచేశారు.

Tags:    

Similar News