భవన నిర్మాణ అనుమతుల జాప్యంపై అధికారులకు జరిమానా..
టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతులలో జాప్యం వహించిన బల్దియాకు చెందిన 9 మంది అధికారులకు జరిమానా విధిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
దిశ, వరంగల్ టౌన్: టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతులలో జాప్యం వహించిన బల్దియాకు చెందిన 9 మంది అధికారులకు జరిమానా విధిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలలో భవన నిర్మాణాల కోసం వచ్చిన దరఖాస్తులలో జాప్యాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తూ 90 మంది అధికారుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.3 వేల అపరాధ రుసుము చొప్పున రూ.2.52 లక్షలు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.