నోటితోనే కాదు.. ఓటుతో కూడా ఆశీర్వదించండి : ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్

Update: 2023-08-25 13:54 GMT

దిశ, తుంగతుర్తి: ప్రభుత్వం ద్వారా వివిధ రకాల పథకాలు అందుకుంటున్న వారంతా నోటి ద్వారా ఆశీర్వదించడమే కాకుండా ఓటు ద్వారా దాన్ని సార్ధకం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంతో ఉన్నారని అన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పెంచిన దివ్యాంగుల ఆసరా పెన్షన్ల ఉత్తర్వులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. తుంగతుర్తి అసెంబ్లీ పరిధిలో ఉన్న 9 మండలాల నుండి 6 వేల మంది దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో 92వేల కుటుంబాలు ఉంటే దాదాపు 50 వేల మందికి పెన్షన్లు అందడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. డీఆర్ఎ పీడీ కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్పి చైర్‌పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు మాట్లాడుతూ.. మానవతకు నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ అని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని వెలుగుపల్లి గ్రామంలో రూ.58 లక్షల వ్యయంతో నిర్మించే అదనపు తరగతి గదులు తదితర వాటికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ ఎస్ కె రజాక్, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలకు చెందిన తహసీల్దార్లు యాదగిరి రెడ్డి, అమీన్ సింగ్, శ్రీనివాస్, ఎంపీడీవోలు భీమ్ సింగ్, సరోజ, ఎంఈఓ బోయిన లింగయ్య, జడ్పిటిసిలు సూరాంభ, దామోదర్ రెడ్డి, ఎంపీపీలు గుండగాని కవిత రాములు, భూరెడ్డి కళావతి, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, నాయకులు నల్లు రామ చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News