హుస్సేన్ సాగర్ వద్ద పోలీసుల వినూత్న ఫ్లెక్సీలు.. షాక్ లో భక్తులు

హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాల మీద హైకోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-10 12:48 GMT

దిశ, వెబ్ డెస్క్ : హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాల మీద హైకోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. 2021 లో ఇచ్చిన తీర్పునే అనుసరిస్తూ కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలని, పీఓపీ విగ్రహాలను ప్రత్యేక పాండ్స్ లో నిమజ్జనం చేయాలని కోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ వద్ద హైదరాబాద్(HYDERABAD) పోలీసులు వినూత్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్లో వినాయక నిమమజ్జనాలు నిషేధించడం జరిగింది అంటూ హుస్సేన్ సాగర్ చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే సాగర్ లో ఏయే ప్రాంతాల్లో నిమజ్జనాలు చేస్తారో అక్కడ పది అడుగుల ఎత్తు మేర ఇనుప మెష్ కూడా అమర్చారు పోలీసులు. అయితే ఈ విషయం ఎరుగని సాధారణ భక్తులు పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, ఇనుప మెష్ లను చూసి షాక్ అవుతున్నారు. కాగా హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు చేయకుండా చూసే బాధ్యత హైడ్రాదే అంటూ.. హైడ్రాను ప్రతివాదిగా చేరుస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్ట్ నేడు కొట్టివేసింది.     


Similar News