పర్యాటక అభివృద్ధిలో అన్ని జిల్లాలకు సముచిత స్థానం కల్పిస్తాం.. మంత్రి జూపల్లి
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎకో టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు ఉన్నాయని, పర్యాటక అభివృద్ధిలో అన్ని జిల్లాలకు సముచిత ప్రాధన్యత కల్పిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎకో టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు ఉన్నాయని, పర్యాటక అభివృద్ధిలో అన్ని జిల్లాలకు సముచిత ప్రాధన్యత కల్పిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం శాసన సభలో శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లో పర్యాటక అభివృద్ధి పై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జూపల్లి సమాధానం ఇచ్చారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ లో పర్యావరణ (ఎకో) పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఉమ్మెడ గ్రామ సమీపంలోని 1.20 ఎకరాల భూమిని, అదేవిధంగా జలాల్ పూర్ గ్రామ పరిధిలోని 3 ఎకరాల భూమిని ప్రభుత్వం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థకు అప్పగించిందని పేర్కొన్నారు. తదుపరి పనులను తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చేపట్టనుందని మంత్రి వెల్లడించారు.
Read More..