ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం

బోధన్ నియోజకవర్గంలో అన్ని సాగునీటి వనరుల కింద 80 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉందని, అలీసాగర్ లిఫ్ట్ కింద సాగు అయ్యే ప్రతి ఎకరాకు నీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.

Update: 2023-12-23 12:00 GMT

దిశ, నవీపేట్ : బోధన్ నియోజకవర్గంలో అన్ని సాగునీటి వనరుల కింద 80 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉందని, అలీసాగర్ లిఫ్ట్ కింద సాగు అయ్యే ప్రతి ఎకరాకు నీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. అలీసాగర్ లిఫ్ట్ ఆయకట్టు కింద సాగునీరు అందించేందుకు శనివారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవీపేట్ మండలం కోస్లీ వద్ద గల పంప్ హౌస్ వద్ద మోటార్లను స్విచ్ ఆన్ చేసి సాగునీరును విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ గత 9 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్ లను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వ్యవసాయం,

    ఇరిగేషన్, మండల అధికారులు అన్ని గ్రామాల్లో పర్యటించి రైతులు పండిస్తున్న పంటల వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని, ఇంట్లో కూర్చొని వివరాలు నమోదు చేయవద్దని హెచ్చరించారు. రైతులు అధికారులకు సహకరించాలని కోరారు. లిఫ్ట్ నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని, చివరి ఆయకట్టు కు నీరు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్, వైస్ ఎంపీపీ యోగేశ్, తహసీల్దార్, ఇరిగేషన్, అగ్రికల్చర్ జిల్లా , మండల అధికారులు, కాంగ్రెస్ నాయకులు తాహెర్ బిన్ హుందాన్, గడుగు గంగాధర్, రత్నాకర్, శ్రీనివాస్ గౌడ్, రాజేంద్ర కుమార్ గౌడ్, నేతికుంట గోపాల్, చల్లా రవి, గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

రైతు దినోత్సవం రోజే నీరు విడుదల

జాతీయ రైతు దినోత్సవం రోజే అలీ సాగర్ నీరు విడుదల చేసి తాను రైతు పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నాట్లు పడే సమయంలో సాగునీరు విడుదల చేయడం తో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. 


Similar News