ప్రతి వరిగింజా కొంటాం

ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడించారు.

Update: 2024-05-15 10:37 GMT

దిశ,నిజాంసాగర్ : ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడించారు. జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ చికోటి జయ ప్రదీప్, రవీందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ను కలిసి వరి కొనుగోలు వేగవంతం చేయాలని వినతి పత్రం అందజేశారు. అకాల వర్షానికి వరి ధాన్యం తడిచిపోవడంతో రైతులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతులు ఆందోళన చెందవద్దని హామీనిచ్చారు.

    సాయంత్రం 5 గంటల వరకు నిజామాబాద్, బోధన్ రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి వరి ధాన్యం తరలించుటకు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని చెప్పారు. గత సంవత్సరం ఈ రోజు వరకు ఒక లక్ష ముప్పై ఐదువేల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, అదేవిధంగా ఈ సంవత్సరం రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. అందుకు గాను నిలువ చేసేందుకు ఇబ్బందిగా మారినందున ధాన్యం తరలింపులో జాప్యం ఏర్పడిందని అన్నారు. నిజామాబాద్, బోధన్ రైస్ మిల్లర్లతో మాట్లాడి, వరి ధాన్యం తరలించి రైతులను ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటామని హామీనిచ్చారు. కొనుగోలు వేగవంతం చేసి, లారీల కొరత లేకుండా చూస్తామని హామీనిచ్చారు.  


Similar News