ఆ పార్టీ ఎదుగుదలకు వినయ్ రెడ్డి ప్రత్యేక చొరవ..
ఆర్మూర్ నియోజకవర్గం రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైంది.
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గం రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైంది. పాత ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఒకప్పుడు జిల్లాలోని ఆరేడు నియోజకవర్గాల్లో పలుపార్టీలు అక్కడి వారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలకు బరిలో దిగాయి. అలాంటి రాజకీయ చైతన్యం కలిగిన ఆర్మూర్ నియోజకవర్గం బీజేపీలో ఆర్మూర్ మండలంలోని కోమన్ పల్లి గ్రామానికి చెందిన ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి చేరారు. గతంలో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ టీడీపీలో ప్రధాన పోటీదారులుగా ఉండేవి. కాలక్రమేన మలిదశ తెలంగాణ ఉద్యమం పుంజుకొని రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండు మార్లు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ మొక్కవోని దీక్షతో బీజేపీలో చేరిన ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్లో బీజేపీని బలపరచడమే ధ్యేయంగా కృషి చేస్తున్నారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివృద్ధి పనులకు, బీజేపీ వసిద్ధాంతాలకు ఆకర్షితులై 2018లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి చేరారు. అప్పటి నుంచి ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ, కార్యకర్తలను సమన్వయ పరుస్తూ బీజేపీ ఎదుగుదలకు విశేషంగా కృషి చేస్తున్నాడు. పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎదుగుదలకు చేస్తున్న శ్రమను గుర్తించి 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వినయ్ కుమార్ రెడ్డికి బీజేపీ పెద్దలు కల్పించారు. ఈ ఎన్నికలలో 19,700 పై చిలుకు ఓట్లు సాధించి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు సాధించిన ఓట్లలో 18వ స్థానంలో వినయ్ కుమార్ రెడ్డి నిలిచాడు. 2019 పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం గెలుపొందడంలో పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ముఖ్య భూమిక పోషించారు.
నిజామాబాదు పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ఆర్మూర్ నియోజకవర్గం నుంచి సుమారు 32,000 వేల అత్యధిక ఓట్ల ఆధిక్యం రావడంలో వినయ్ కుమార్ రెడ్డి విశేషంగా కృషి చేశాడు. అటు తరువాత జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక ఎన్నికల్లో 15 ఎంపీటీసీ స్థానాలను, 1 జెడ్పీటీసీ స్థానాన్ని గెలిపించి ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేశాడు. తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో జీడిమెట్ల డివిజన్ బీజేపీ ఇంచార్జిగా వినయ్ కుమార్ రెడ్డి పనిచేశారు. ఆ సమయంలో టీఆర్ఎస్ నాయకుల దాడిని ఎదుర్కొని భయపడకుండా పార్టీ కోసం పనిచేసి బీజేపీ అభ్యర్థి 4806 (టాప్ 5వ మెజార్టీ) ఓట్లు మెజారిటీతో, గెలుపొందడంలో వినయ్ కుమార్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించాడు.
ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నుండి 6 అభ్యర్థులు కౌన్సిలర్లుగా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో పాటు ఆర్మూర్ నియోజకవర్గంలో 18 శివాజీ మహారాజ్ విగ్రహాలు సొంత డబ్బులతో పెట్టిస్తూ యువతను తన వైపు తిప్పుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. ఆర్మూర్ నియోజకవర్గంలో గత ఆరున్నర సంవత్సరాల నుండి అన్ని పండగలకి సుమారు 5,000 క్వింటల్ బియ్యం అందించి వినయ్ కుమార్ రెడ్డి ప్రజలకు, యువకులకు అత్యంత చేరువవుతున్నాడు. బీజేపీ అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చిన, ఏ పని చెప్పినా ఆ పని చేసుకుంటూ పోతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజల్లో బలమైన అభిమానాన్ని పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సంపాదించుకున్నారు.