రేపు ఏకసభ్య కమిషన్ రాక

ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ ఈ నెల 2న (గురువారం) ఉదయం 11.00 గంటలకు రానున్నారు.

Update: 2025-01-01 14:08 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ జనవరి 01: ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ ఈ నెల 2న (గురువారం) ఉదయం 11.00 గంటలకు రానున్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉపవర్గీకరణ,వివరణాత్మక అధ్యయనం కోసం విచ్చేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్,కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన వారు హాజరై,తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టీస్ డాక్టర్ షమీమ్ అక్తర్ తో కూడిన ఏక సభ్య కమిషన్ కు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. ఎస్సీ కులానికి చెందిన ప్రజాప్రతినిధులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు, షెడ్యూల్డు కుల సంఘాల నాయకులు, ఇతర ఉద్యోగులు, ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన అన్ని వర్గాల వారు హాజరై ఏకసభ్య కమిషన్ కు తమ తమ వినతులు అందజేయాలని అన్నారు.


Similar News