సీఎం టూర్ లో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు

ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడిస్తేనే రైతులకు భవిషత్ ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ శాసన సభ్యులు రేగా కాంతారావు అన్నారు.

Update: 2024-03-12 09:05 GMT

దిశ,మణుగూరు/పినపాక : ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడిస్తేనే రైతులకు భవిషత్ ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ శాసన సభ్యులు రేగా కాంతారావు అన్నారు. ఆయన మంగళవారం సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు. పులుసుబొంత ప్రాజెక్టు ఫైల్ రెడీగా ఉందని మీ హామీలు నిజమైతే క్యాబినెట్ లో పెట్టించండన్నారు. దమ్ముంటే ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి డబ్బులతో పాటు తులం బంగారం,18 సంవత్సరాలు నిండిన మహిళలకు రూ.2500 అమలు చేయాలన్నారు.

     అలాగే మిగిలిన భూములకు పోడు పట్టాలు ఇప్పించాలన్నారు. సీఎం మాటలన్నీ మేకపోతు గాంభీర్యమే తప్ప ఏమీలేదన్నారు. నిన్న జరిగిన సీఎం టూర్ లో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. జిల్లాకు నిధులు తేవడంలో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో మండిపడ్డారు. రైతుబంధు, రైతు బీమా తీసుకోని వాళ్లని మీరు ఓట్లు అడగరా అంటూ సవాల్ విసిరారు. పోడు పట్టాలకు రైతుబంధు ఇవ్వాలని, మాటలు చెప్పడంలో కాదు చేతలలో చూపించాలని ఫైర్ అయ్యారు. 


Similar News