కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం..అసలేం జరిగిందంటే..?

డివైడర్ మధ్యలో పెట్టిన మొక్కల నిర్వహణను గాలికి వదిలేశారు.

Update: 2024-10-27 13:47 GMT

దిశ, మాచారెడ్డి: డివైడర్ మధ్యలో పెట్టిన మొక్కల నిర్వహణను గాలికి వదిలేశారు. కామారెడ్డి - సిరిసిల్ల రహదారిపై మాచారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఘన్ పూర్ గ్రామం వరకు నిర్మించిన రోడ్డు డివైడర్ మధ్యలో పెట్టిన మొక్కల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. గ్రామ పంచాయతీ పట్టించుకోలేదు. కాంట్రాక్టు ఏజెన్సీ పట్టించుకోకపోవడంతో.. ప్రయాణీకులకు ఆహ్లాదాన్ని పంచే మొక్కలు నిర్వహణ లేక ఎండిపోయి, గడ్డి పిచ్చి మొక్కలతో నిండిపోయింది. దీంతో ఇటీవలే మాచారెడ్డికి వచ్చిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ దృష్టిలో పడింది.వెంటనే ఆయన కాంట్రాక్టు ఏజెన్సీ కి ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో స్థానిక ఎంపిడిఓ కు ఫోన్ చేసి డివైడర్ మధ్యలో ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని గడ్డి,పిచ్చి మొక్కలు తొలగించే నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎంపీడీవో ఉపాధి హామీ పథకం కూలీలను, గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకులను ఉపయోగించి నిర్వహణ పనులు చేపట్టారు.కానీ ఆ తర్వాత ఎవరు ఈ డివైడర్ మొక్కల నిర్వహణ చేయాలనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. గ్రామ పంచాయతీకి నిర్వహణ బాధ్యత ను అప్పగించాలని స్థానికుల అభిప్రాయ పడుతున్నారు. 


Similar News