ముగిసిన ఎన్నికల ప్రచారం

లోక్​సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది.

Update: 2024-05-11 12:45 GMT

దిశ, కామారెడ్డి : లోక్​సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. అప్పటి నుండి నిషేధం అమలులోకి వచ్చిందని, ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని, ఐదుగురికి మించి ఒకే చోట గుమికూడరాదన్నారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ దృష్ట్యా జిల్లాయేతర వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ఉండకూడదని స్పష్టం చేశారు. ఎఫ్ఎస్ టీ, ఎస్ ఎస్ టీ, ఎంసీసీ, పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్లు తనిఖీ లు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

    సాయంత్రం 6 గంటల నుండి ఎలాంటి అభ్యంతకరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ ఎస్ఎంఎస్ల పై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని తెలిపారు. అదేవిధంగా ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ నిషేధమని, ఫలానా అభ్యర్థి గెలవబోతున్నారని కూడా ప్రసారం చేయరాదని కలెక్టర్ తెలిపారు. అసత్య వార్తలు ఎన్నికల సరళిని ప్రభావితం చేసే అవకాశమున్నందున మీడియా ఒకటికి రెండు మార్లు ఆ వార్తను రూడీ చేసుకోవాలని కోరారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జర్నలిస్ట్ కండక్ట్ నార్మ్స్ 2022, ఎన్బీఎస్ఏ జారీచేసిన మార్గదర్శకాలను, వాలంటరీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ననుసరించి మీడియా తమ వార్తలను ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో మద్యం షాపులను మూసివేయించి, డ్రై డేగా ప్రకటించినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.


Similar News