అక్కాచెల్లెళ్ల డబుల్ ధమాకా

ఒక్క ఉద్యోగం సంపాదించడానికే నానా కష్టాలు పడుతున్న ఈ రోజుల్లో..ఒక్కొక్కరు రెండు ఉద్యోగాలు సాధించడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, సన్నిహితులు వారిని అభినందిస్తున్నారు

Update: 2024-11-15 09:33 GMT

దిశ, కామారెడ్డి : ఒక్క ఉద్యోగం సంపాదించడానికే నానా కష్టాలు పడుతున్న ఈ రోజుల్లో..ఒక్కొక్కరు రెండు ఉద్యోగాలు సాధించడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, సన్నిహితులు వారిని అభినందిస్తున్నారు. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సంపాదించగా... గురువారం ప్రకటించిన గ్రూప్-4 ఫలితాల్లో కూడా వీరిద్దరూ ఎడ్యుకేషన్ విభాగంలో ఉద్యోగాలు సాధించారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన హన్మాల రమ్య, హన్మాల వైష్ణవిలు చిన్న నాన్న పెద్దనాన్న కూతుళ్ళు. వీరిద్దరూ స్థానిక చైతన్య స్కూల్లో పదవ తరగతి వరకు చదివారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సాందీపని కళాశాలలో ఇంటర్, ఆర్కే డిగ్రీ కళాశాలలో డిగ్రీ, ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషషన్లో టీటీసీ, డీఈడీ పూర్తి చేశారు. అయితే ఇటీవల వీరు డీఎస్సీ రాయగా..2024 డీఎస్సీ ఫలితాల్లో జిల్లాలో ఆరవ ర్యాంకు సాధించిన రమ్య ఉపాధ్యాయురాలుగా సెలెక్ అయ్యి.. తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ గ్రామంలో విధులు నిర్వహిస్తోంది. వైష్ణవి కూడా డీఎస్సీ ఫలితాల్లో జిల్లాలో ఐదవ ర్యాంకుతో ఉద్యోగం పొంది..రాజంపేట బీసీ కాలనీ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తోంది. అయితే గురువారం ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 4 ఫలితాల్లో కూడా వీరిద్దరూ విద్యాశాఖలో ఉద్యోగాలు సాధించారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒకే రకమైన ఉద్యోగాలు రెండుసార్లు సాధించడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. వీరి కృషి, పట్టుదలనుఒక్క ఉద్యోగం సంపాదించడానికే నానా కష్టాలు పడుతున్న ఈ రోజుల్లో..ఒక్కొక్కరు రెండు ఉద్యోగాలు సాధించడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, సన్నిహితులు వారిని అభినందిస్తున్నారు చూసి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


Similar News