Armor MLA : షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే...
ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు, మాక్లూర్ మండలాల్లో సోమవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు, మాక్లూర్ మండలాల్లో సోమవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ రెండు మండలాలకు చెందిన లబ్ధిదారులకు 160 మందికి మాక్లూర్ ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 3500 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో నిరుపేదలను ఆదుకుంటామని అన్నారు. నా నియోజకవర్గంలో ఎవరు కూడా, ఎక్కడ కూడా అధైర్యపడవద్దు అని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తానన్నారు.
ఇల్లు లేని వారికి ఇళ్లను కట్టిస్తానని, కొత్త రేషన్ కార్డులను త్వరలోనే మంజూరు చేయిస్తానని అన్నారు. అంతేకాకుండా స్థానిక ఎన్నికలు రానున్నాయని, ఎలక్షన్లు రాగానే ఓట్ల బిచ్చగాళ్లు వస్తుంటారని, ప్రజలు జాగ్రత్తగా గమనించాలని, మంచి నాయకులను ఎన్నుకోవాలని, పనిచేసే నాయకులకు పట్టం కట్టాలని హితవు పలికారు. ఓడిపోయిన నాయకులు మాయ మాటలు చెప్పితే నమ్మొద్దని, ప్రజల లబ్ధి కొరకు ఎవరినైనా ఎదిరిస్తానన్నారు. ఐలాపూర్ హాస్టల్ విద్యార్థుల బాధను అసెంబ్లీలో ప్రశ్నించి 49 లక్షలు మంజూరు చేయించానని, గల్ఫ్ బాధితుల గురించి గళ మెత్తానని, నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయమని, నియోజకవర్గ ప్రజల అభ్యున్నతే నా లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమాల్లో రెండు మండలాల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.