Municipal authorities : రోడ్డు పై పారుతున్న మురుగు.. పట్టించుకోని అధికారులు..

ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల కోటార్ మూర్ ఏరియాలోని మున్సిపల్ 6 వ వార్డ్ శివారులో గల జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ప్రధాన రోడ్డులో మురుగు పారుతుంది.

Update: 2024-10-29 05:16 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల కోటార్ మూర్ ఏరియాలోని మున్సిపల్ 6 వ వార్డ్ శివారులో గల జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ప్రధాన రోడ్డులో మురుగు పారుతుంది. 63 వ నెంబర్ జాతీయ రహదారి ప్రక్కన ఫిష్ మార్కెట్ ప్రక్కన గల రోడ్డులో వర్షాకాలం ముగిసి నెలవుతున్నా డ్రైనేజీలు నిండుకోవడంతో మురుగంతా రోడ్డుపైనే పారుతుంది. ఆ రోడ్డు గుండా రాకపోకలు సాగించే ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై మురుగు పాడడంతో ఆ రోడ్డు గుండా రాకపోకలు సాగించే ప్రజలకు దుర్గంధం వెదజల్లుతుంది. ఆ రోడ్డు పక్కన డ్రైనేజీల పక్కన ఏపుగా పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పాటు డ్రైనేజీలు వ్యర్థ పదార్థాలతో నిండుకోవడంతో మురుగునీరంతా రోడ్డుపైనే పారుతుంది.

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఆరో శివారులో గల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న అధికారులు పాలకులు ఏం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్మూర్ మున్సిపల్ అధికారులు పాలకులు ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు క్రమం తప్పకుండా మున్సిపాలిటీ పన్నులు వసూలు చేస్తున్నా కనీసం నిండుకున్న డ్రైనేజీల వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఆరో మున్సిపల్ వార్డులోని శివారు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలను ఎదుర్కొంటున్నారు. ముందు రోజుల్లో మున్సిపల్ పన్నులు చెల్లించాలని ఇండ్లకు వచ్చే అధికారులకు మున్సిపల్ పన్నులు చెల్లించేందుకు నిరాకరించేందుకు అవార్డులోని శివారు ప్రజలు చర్చించుకున్నట్టు తెలిసింది.

Tags:    

Similar News