బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నాయకులు రమేష్ గుప్తా రాజీనామా

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు రమేష్ గుప్తా పార్టీకి రాజీనామా చేశారు.

Update: 2024-03-12 11:21 GMT

దిశ, కామారెడ్డి క్రైమ్ : బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు రమేష్ గుప్తా పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలకు పైగా తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతుగా కేసీఆర్ వెనకాల ఉండి ఉద్యమంలో పాల్గొన్నట్టు తెలిపారు. స్వరాష్ట్రం సాధించుకున్నాక కొందరు

     వలసవాదులకు పదవులు ఇవ్వడం వారి నుండి తమకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో పార్టీ వీడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొందరు స్థానిక నాయకుల స్వార్థం వల్లే కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ నుండి పలువురు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆయన అనుచరుల ఆగడాలే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.


Similar News