జాతీయ రహదారిపై ఆర్టీఏ సిబ్బంది దాడి..

నిజామాబాద్ జిల్లాలోని జాతీయ రహదారి 44పై ఒక లారీ డ్రైవర్ పై ఆర్టీఏ సిబ్బంది దాడి చేసిన వీడియో వైరల్ అయింది.

Update: 2023-01-14 14:39 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని జాతీయ రహదారి 44పై ఒక లారీ డ్రైవర్ పై ఆర్టీఏ సిబ్బంది దాడి చేసిన వీడియో వైరల్ అయింది. రెండు రోజుల క్రితం జరిగినట్టు ఉన్న విడియో ఇప్పుడు జిల్లాలో సోషల్ మిడియాలో హల్ చల్ చేస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలోని రహదారిపై నాగ్ పూర్ వైపు వెలుతున్న లారీని ఆర్టీఏ సిబ్బంది ఆపేందుకు యత్నించారు. కాని డ్రైవర్ అక్కడ అపకుండా కొద్ధి దూరం తీసుకువెళ్లి ఆపడంతో రవాణాశాఖ కానిస్టేబుళ్లకు కోపం నాశలాన్ని అంటినట్లు లారీ క్యాబిన్ లో కూర్చున్న డ్రైవర్ పై పిడిగుద్ధులు గుద్దారు. అతడిని బలవంతంగా బయటకు లాగిలాఠిలకు పని చెప్పారు. పాపం అమాయకుడైన లారీ డ్రైవర్ పై జరిగిన దాడిని మరో లారీలో ఉన్న వ్యక్తి విడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ విషయం బహిర్గతం అయింది.

జాతీయ రహదారి పై చెక్ పోస్టుల వద్ధ వాహనాలు తనిఖీలు చేయాల్సి ఉండగా చెక్ పాయింట్ పేరిట పెర్కిట్ శివారు మొదలుకొని బాల్కొండ వరకు నిత్యం వాహనాల తనిఖీలు పత్రాలు సరిగ్గాలేవని వసూళ్ల వ్యవహరం జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. కాని ఇవేమి పట్టించుకోకుండా లారీకి అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నయాని చెబుతున్న ఆర్టీఏ సిబ్బంది పోలిస్ కానిస్టెబుళ్ల మాధిరిగా డ్రైవర్ ను చితక బాదిన వ్యవహరం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్టీఏ అధికారులు దాడులకు, ప్రైవేట్ వసూళ్లకు ప్రైవేట్ వ్యక్తిని నియమించుకోని దాడి ఘటనలో పాల్గోనడంపై నెటిజన్ లు మండిపడుతున్నారు. రవాణా శాఖ అధికారులు, సిబ్బంది చేసిన దౌర్జన్యంపై సోషల్ మిడియాలో పోస్టింగ్ లు చేసి వారి ధన దాహంపై మండి పడుతున్నారు. లారి డ్రైవర్ పై, దాడి చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News