ప్రజా పాలన సేవా కేంద్రాలు ప్రారంభించాలి : జిల్లా కలెక్టర్

ప్రజా పాలన సేవా కేంద్రాలను పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని

Update: 2024-03-05 16:40 GMT

దిశ, ఆసిఫాబాద్ : ప్రజా పాలన సేవా కేంద్రాలను పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి జిల్లా పరిషత్ పంచాయతీ రాజ్ శాఖ, మండల పరిషత్ పంచాయతీ అధికారులతో ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన గ్యారెంటీ పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్, జిల్లా పంచాయతీ అధికారి సమన్వయంతో సాంకేతిక విభాగంపై ప్రత్యేక దృష్టి సారించి దరఖాస్తులను డిజిటలైజ్ చేయడంలో జాగ్రత్త వహించాలని ఆదేశించారు.

జిల్లాలో 1 లక్ష 60 వేల దరఖాస్తులు వచ్చాయని. అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్. విద్యుత్ పథకాల అమలు కోసం ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మొబైల్. ఓ టి పి ఆధార్. రేషన్ కార్డులు. దరఖాస్తు. గ్యాస్ బుక్ సంఖ్య, డెలివరీ రిపోర్ట్ అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో 15, పట్టణ ప్రాంతాలలో 2 ప్రజా పాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు, సహాయకులతో జూమ్ మీటింగ్ ద్వారా దశల వారీగా వివరాలు పర్యవేక్షించాలని తెలిపారు. 100శాతం పన్నులు వసూలు సాధించడంతో పాటు జాబ్ కార్డు కల్గిన ప్రతి ఒక్కరికి 100 రోజులు ఉపాది పనులు కల్పించాలని. వేసవి నేపథ్యంలో గ్రామాల్లో నీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


Similar News