వీఆర్ఏ, ఎంపిటీసీల పై చర్యలు తీసుకోవాలి : ప్రెస్ క్లబ్ సభ్యుల డిమాండ్

పోతంగల్ మండలం సుంకిని గ్రామానికి చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ అధికార మదంతో.. భార్య వీఆర్ఏ పోస్ట్ ను అడ్డుపెట్టుకొని పగలు రాత్రి అనే తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాడని స్థానికులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పోతంగల్ తహసీల్దార్ రమేష్ కు ఫిర్యాదు చేశారు.

Update: 2023-02-20 11:29 GMT

దిశ, కోటగిరి : పోతంగల్ మండలం సుంకిని గ్రామానికి చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ అధికార మదంతో.. భార్య వీఆర్ఏ పోస్ట్ ను అడ్డుపెట్టుకొని పగలు రాత్రి అనే తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాడని స్థానికులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పోతంగల్ తహసీల్దార్ రమేష్ కు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన విలేకరుల పై ట్రాక్టర్లను ఎక్కించి చంపేస్తామని అనేక విధాలుగా దుర్భషాలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడన్నారు.

సుంకిని ఎంపీటీసీ సాయిలు, అతని భార్య వీఆర్ఎ లపై వెంటనే చర్యలు తీసుకొని అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ప్రెస్ క్లబ్ సభ్యులు కోరారు. ఈ కార్యకమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు సుదీప్, కృష్ణ కుమార్, పెంటన్న, శ్రీకాంత్, సాయిలు, వహీద్, రాములు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News