నాణ్యత లోపం - గ్రామస్తులకు శాపం..
ప్రభుత్వం కోట్లు వెచ్చించి గ్రామాల అభివృద్ధి కోసం నిధులను కేటాయిస్తే కాంట్రాక్టర్లు, కుమ్మక్కై ప్రభుత్వ నిధులకు గండికొడుతూ ప్రజాధనాన్ని దోచుకుతున్నారు.
దిశ, కోటగిరి : ప్రభుత్వం కోట్లు వెచ్చించి గ్రామాల అభివృద్ధి కోసం నిధులను కేటాయిస్తే కాంట్రాక్టర్లు, కుమ్మక్కై ప్రభుత్వ నిధులకు గండికొడుతూ ప్రజాధనాన్ని దోచుకుతున్నారు. ఇందుకు నిదర్శనంగా పోతంగల్ మండలకేంద్రంలోని పాత పోతంగల్ గ్రామంలో ఇటీవలకాలంలో వేసిన రోడ్లను నాణ్యతను చూస్తేనే తెలుస్తుంది.
గత ఆరునెలల క్రితం వేసిన రోడ్లు నాసిరకంగా వేయడంతో కంకర పైకి తేలి అధ్వానంగా మారినా పరిస్థితి ఏర్పడింది. పాతపోతంగల్ గ్రామంలో సుమారు 500 మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టగా కాంట్రాక్టర్ తమస్వలాభం కోసం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని నిర్లక్ష్యం, నాణ్యత లోపం కారణంగా ఆరునెలలు తిరగకుండానే కంకర్ తేలియాడడంతోపాటు గుంతలమయంగా మారడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతను పరిశీలించాల్సిన సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకుండా ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.