పేకాట రాయుళ్ళ పై పోలీసుల పంజా... ఏడుగురు అరెస్ట్
పేకాట శిబిరంపై దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మండల పరిధిలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది
దిశ,తాడ్వాయి : పేకాట శిబిరంపై దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మండల పరిధిలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది.ఎస్సై వేంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం..తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామ శివారులో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వాసనియ సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించి..ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.13,130 నగదు 7 సెల్‌ఫోన్లు,52 ప్లేయింగ్ కార్డ్సు,7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.