పాల్వంచ తహశీల్దార్‌ను బదిలీ చేయాలి.. రైతుల డిమాండ్
కామారెడ్డి జిల్లా పాల్వంచ తహశీల్దార్ ను వెంటనే బదిలీ చేయాలని మండల
దిశ,మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా పాల్వంచ తహశీల్దార్ ను వెంటనే బదిలీ చేయాలని మండల రైతులు డిమాండ్ చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ ఆయన పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గురువారం తహశీల్దార్ కార్యాలయంలో విచారణ జరిపారు. ఆయన విచారణలో భాగంగా తహశీల్దార్ గత సంవత్సరం నుంచి తమను ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా, భూములు రిజిస్ట్రేషన్ చేయకుండా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు.
తహశీల్దార్ జయంత్ రెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్‌ను బదిలీ చేయాలని రైతులు కోరారు. ఏడాదిగా తమ సమస్యలపై కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రైతులతో మాట్లాడిన అదనపు కలెక్టర్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విచారణ లో మండలంలోని వివిధ గ్రామాల రైతులు నాయకులు పాల్గొన్నారు. తహశీల్దార్ జయంతి రెడ్డి పై వచ్చిన ఆరోపణలు, విచారణ నేపథ్యంలో ఆయన దీర్ఘకాలిక సెలవులో వెళ్లినట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.