కన్న కొడుకులు కాదంటున్నారయ్యా... మాకు మీరే దిక్కు ..
జన్మనిచ్చిన మాకు బుక్కెడు బువ్వ పెట్టి, మా ఆలన చూసుకోవాలని వృద్ధ దంపతులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
దిశ, నిజామాబాద్ సిటీ : జన్మనిచ్చిన మాకు బుక్కెడు బువ్వ పెట్టి, మా ఆలన చూసుకోవాలని వృద్ధ దంపతులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. పూర్తి వివరాల్లోకివెళితే నిజామాబాద్ నగరంలోని నర్శగౌడ్ వీధికి చెందిన న్యామ తాబాద్ గంగాజి, లక్ష్మీబాయి అనే వృద్ధ దంపతులు ఉన్నారు. వారికొడుకు వారికి బుక్కెడు బువ్వపెట్టి వారి ఆలనా పాలన చూసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
సోమవారం వృద్ధ దంపతులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడుతూ నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని ప్రస్తుతం ఉన్న మడిగెల నుంచి వచ్చే అద్దె డబ్బులతోనే వారి జీవనం కొనసాగుతుందని తెలిపారు. మడిగే కిరాయి కూడా ఇవ్వాలని వారి కొడుకులు వేధిస్తున్నారని అన్నారు. ఈ వయసులో వంట చేసుకుని తినడానికి కూడా ఆరోగ్యం సహకరిస్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి కలెక్టర్ సారు స్పందించి మాకు న్యాయం చేయాలని వృద్ధ దంపతులు కోరారు.