వెలవెల పోతున్న ఉత్తర తెలంగాణ వరప్రదాయిని

ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నేడు వెలవెల పోతుంది.

Update: 2024-05-27 14:13 GMT

 దిశ : బాల్కొండ : ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నేడు వెలవెల పోతుంది. ఈ సంవత్సరం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరినప్పటికీ ఈ ఏడు నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోయింది. ఎస్ఆర్ఎస్ పి నుండి నీటిని వదిలేందుకు హైదరాబాదులోని ఉన్నత స్థాయి అధికారులు, మంత్రులు ఏర్పాటు చేసిన సమావేశంలో శివం కమిటీ నిర్ణయించిన మేరకు ఖరీఫ్, రబీ పంటలకు పూర్తిస్థాయి సాగునీటిని అందించింది. కాకతీయ, లక్ష్మి, సరస్వతి, వరద, కాలువ లు, అలీ సాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలతో పూర్తిస్థాయి నీటిని అందించింది. అదేవిధంగా కాలువలతో అనుసంధానమైన అన్ని చెరువులకు తాగునీటిని నింపింది.

యాసంగి పంటలు గట్టెకుతాయో లేవోనని రైతులు ఆందోళన చెందిన అధికారులు అనుకున్న తీరున నీటిని సరఫరా చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 90.313 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రానికి 10.254 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టులో 21. 224 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటినీలలో ఐదు టీఎంసీలు డెడ్ స్టోరేజీ మరో రెండు టీఎంసీలు మిగిలేది మూడు టీఎంసీలు మాత్రమే. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సగానికంటే తక్కువ నీటి నిల్వ ఉండడం రైతులను కలవరపెడుతోంది.

ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రాకుంటే తిప్పలే... గత నాలుగు సంవత్సరాల నుండి ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అదేవిధంగా మిగులు జలాలను గోదావరి ద్వారా విడుదల చేశారు. 2019 సంవత్సరం నుంచి కనిష్ట సాయికి నీటిమట్టం తగ్గిపోవడం ఇదే తొలిసారి. ఎస్సారెస్పీ ఎగువన ఉన్న మహారాష్ట్రలో వర్షాలు కురిస్తే ప్రాజెక్టు ఈ ఏడు సకాలంలో నిండుకుంటుంది. నిజామాబాద్ నిర్మల్ జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాలలో వర్షాలు కురిసి ప్రాజెక్టు నిండుకుండలా మారాలని రైతన్నలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Similar News