భర్త ఇంటి ముందు భార్య ధర్నా

అదనపు కట్నం తీసుకురావాలని భర్త వేధింపులకు గురి చేయడంతో భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ఎదుట ధర్నా చేపట్టింది.

Update: 2024-03-10 10:18 GMT

దిశ, కామారెడ్డి : అదనపు కట్నం తీసుకురావాలని భర్త వేధింపులకు గురి చేయడంతో భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ఎదుట ధర్నా చేపట్టింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భవానీ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. 2019లో సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన శివానిని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భవాని నగర్ కాలనీకి చెందిన వడ్ల కార్తీక్ వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో వడ్ల కార్తిక్ కు 5 లక్షల నగదు,15 తులాల బంగారాన్ని వరకట్నం గా శివాని తల్లిదండ్రులు అప్పగించారు.

    వివాహమైన 3 నెలల తర్వాత గర్భవతి కావడంతో శివానిని తల్లిగారి ఇంటి వద్ద కార్తీక్ వదిలేసి వెళ్లిపోయాడు. పాప పుట్టిన తరువాత పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదిర్చి వారిని హైదరాబాదులో ఉంచారు. మరో 6 నెలల అనంతరం అదనపు కట్నం 10 లక్షలు తేవాలని శివానీని కార్తీక్ వేధించడం మొదలు పెట్టాడు. మళ్లీ కార్తీక్ శివానీని తల్లి గారి ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శివానీ కుటుంబ సభ్యులు భర్త ఇంటి వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో ఇంటి ముందు కూర్చున్న శివానీ కుటుంబ సభ్యులను భర్త కార్తీక్ చితక బాదాడని వారు వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువురి కుటుంబ సభ్యులను కామారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు. శివానీకి న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. 


Similar News