కేసీఆర్ సారథ్యంలో రైతు సంక్షేమానికి పెద్దపీట...

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అర్సపల్లిలో రైతుదినోత్సవాన్ని పురస్కరించుకుని అర్సపల్లి రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

Update: 2023-06-03 12:27 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అర్సపల్లిలో రైతుదినోత్సవాన్ని పురస్కరించుకుని అర్సపల్లి రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. శనివారం రైతుదినోత్సవాన్ని పురస్కరించుకొని మున్నూరుకాపు సంఘంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని, రైతులతో సమావేశాలు నిర్వహించుకొని తెలంగాణ రైతాంగం సాధించిన ప్రగతిని, లక్ష్యాలని, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యాలని వివరించాలని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న రైతుసంక్షేమ పథకాల ద్వారా వ్యవసాయ రంగంలో ఘననీయ పురోగతి సాధించిందన్నారు. అర్సపల్లి ప్రాంత రైతుల కొరకు నిజాం సాగర్ కెనాల్ 2 కోట్ల 50 లక్షల రూ. లతో ఆధునికరించి పంటపొలాలకు నీటిని అందిస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో నగరమేయర్ దండునీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ముచుకుర్ లావణ్య, కార్పొరేటర్లు నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News