నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అదుపులో కామారెడ్డి ఎక్సైజ్ కానిస్టేబుల్

కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది కల్తీకల్లు తయారీ ముస్తదారులతో కలిసి నిర్వహిస్తున్న నిషేధిత అల్ఫజోలం దందాను హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు భగ్నం చేశారు.

Update: 2023-12-24 16:43 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది కల్తీకల్లు తయారీ ముస్తదారులతో కలిసి నిర్వహిస్తున్న నిషేధిత అల్ఫజోలం దందాను హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు భగ్నం చేశారు. రెండు రోజుల క్రితం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక కానిస్టేబుల్ ను, ఇద్దరు కల్లు ముస్తేదారులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నిషేధిత 30 కిలోల ఆల్ఫా జోలుం ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఆల్ఫా జోలుం ను (కృత్రిమ) కల్తీకల్లు లో తయారీలో వినియోగిస్తారు. ఈత తాటి చెట్లు లేని ప్రాంతంలో కల్లు సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహించే కల్లు డిపోలలో జరిగే రసాయన పదార్థాలతో తయారీ అయ్యే

    కృత్రిమ కల్తీకల్లు సరఫరా అందరికీ తెలిసిందే. కామారెడ్డి జిల్లాలో జరిగే కల్తీకల్లు కొందరు సిండికేట్ గా ఏర్పడి మత్తు పదార్థాలను కలిపి విక్రయిస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోని కామారెడ్డి ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వారు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు కోట్ల విలువైన నిషేధిత ఆల్ఫా జోలుం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో మరి కొంతమంది ఎక్సైజ్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులకు కానిస్టేబుల్ అరెస్టు విషయం గురించి సమాచారం అందించినట్టు తెలిసింది.

    ఈ విషయంపై కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు, కామారెడ్డి ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ విక్రమ్ లను వివరణ అడుగగా తమకు ఆదివారం సాయంత్రమే విషయం తెలిసిందని లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. ఎక్సైజ్ అధికారులుగా కొందరు సిబ్బంది అల్పజోలుం దందాను చేస్తున్నట్టు సమాచారం. తమ ఉద్యోగాన్ని ఆసరాగా చేసుకొని హైదరాబాద్​, మహారాష్ట్ర నుంచి నిషేధిత మత్తు పదార్థాలను తీసుకువచ్చి కల్తీకల్లు తయారు చేసే ముస్తేదారులకు ఇస్తున్నట్టు తెలిసింది. ఈ కేసులో మరి కొంతమంది సిబ్బంది ప్రమేయం ఉండడంతో కామారెడ్డి జిల్లా అధికారి శాఖలో ఈ వ్యవహారం కలకలం రేపింది. ఇక్కడ తమ పేర్లు బయటకు వస్తాయని వారు భయపడిపోతున్నారు.


Similar News