భయపెడుతున్న కండ్లకలక..హాస్టల్స్, పాఠశాలలో విద్యార్థులకు తప్పని తిప్పలు
జిల్లాలోని నందిపే ట్ మండలం నూత్ పల్లిలోని ఓక సంక్షేమ హాస్టల్ లో 50మంది చిన్నారులకు కండ్ల కలక సోకింది. ధర్మారంలోని 42మంది గురుకుల జూనియర్ కళాశాల స్థాయి విద్యార్థినులు దాని బారిన పడ్డారు. ఎడపల్లిలోని ఓక సంక్షేమ హా స్టల్
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం నూత్ పల్లిలోని ఓ సంక్షేమ హాస్టల్ లో 50మంది చిన్నారులకు కండ్ల కలక సోకింది. ధర్మారంలోని 42మంది గురుకుల జూనియర్ కళాశాల స్థాయి విద్యార్థినులు దాని బారిన పడ్డారు. ఎడపల్లిలోని ఒక సంక్షేమ హాస్టల్ లో 19మంది, బోధన్ పట్టణంలోని మరో సంక్షేమ హాస్టల్ లో 36మంది, నవిపేట్ లో 12మంది విద్యార్థులు కండ్ల కలక బారినపడ్డారు. గత పదిరోజులుగా కండ్ల కలక కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులలో ఓపీ పెరిగిపోయింది. ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్ లలో లెక్కలు అంతు చిక్కడం లేదు... ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు కండ్ల కలక నివారణకు ఉపయోగించు చుక్కలు మందులు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని నందిపే ట్ మండలం నూత్ పల్లిలోని ఓక సంక్షేమ హాస్టల్ లో 50మంది చిన్నారులకు కండ్ల కలక సోకింది. ధర్మారంలోని 42మంది గురుకుల జూనియర్ కళాశాల స్థాయి విద్యార్థినులు దాని బారిన పడ్డారు. ఎడపల్లిలోని ఓక సంక్షేమ హా స్టల్ లో 19మంది, బోధన్ పట్టణంలోని మరో సంక్షేమ హాస్టల్ లో 36మంది, నవిపేట్ లో 12మంది విద్యార్ధులు కండ్ల కలక బారినపడ్డా రు. గత పదిరోజులుగా కండ్లకలక కేసులు విఫరితంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులలో ఓపీ పెరిగిపోయింది. ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్ లలో లెక్కలు అంతు చిక్కడం లేదు... ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు కండ్ల కలక నివారణకు ఉపయోగించు చుక్కలు మందులు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు.
జిల్లాలో కండ్లకలక అందరిని కలవర పెడు తోంది. ప్రదానంగా చిన్నారులను ఈ అంటు వ్యాధి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. చిన్న పిల్లలకైతే కండ్ల కలక లక్షణాలు ఉంటే చాలు స్కూల్ లకు అనుమతించమని పాఠశాల నిర్వహకులు ఖరఖండిగా చెబుతున్నారు. పిల్లలను కళ్లజోళ్లు లేకుండా పాఠశాలలకు రావద్ధని సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి నిత్యం 20 కి తక్కువ గా కాకుండా ఓఫి వస్తున్నట్టు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో అదే పరిస్థి తి. ఇక హాస్టల్ లలో ఉండే విద్యార్ధుల కష్టాలు అన్ని ఇన్ని కావు. బాలికలు చదివే కేజిబివిలు మొదలుకోని హాస్టల్ లలోనుంచి ఇంటి బాట పట్టా రు. వాన కాలంలో వచ్చే సీజనల్ వ్యాధి లాంటి కండ్ల కలక అంటే ఇప్పుడు అందరికి దడ పుట్టిస్తుంది. పక్షం రోజులు కాకుండానే అంటు వ్యాధి పిల్ల లు, పెద్దల దాని బారిన పడుతున్నారు. గడిచిన వారం జిల్లాలో దండిగా వాన లు పడినప్పుడు ప్రబలిన ఈ కండ్ల కలక అందరిని చూట్టేసింది. పెద్ధలు, పిల్లలు అన్న తేడా లేకుండా దాని బారి న పడిన వారు పిడుతులుగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. రెండు వారా లుగా మెడికల్స్ లలో చుక్కల మందు గిరాకి పెరిగిపోవడానికి కండ్ల కలక విస్థరణ అని చెబుతున్నారు. జిల్లాలో, కామా రెడ్డి జిల్లా లో అన్ని డివిజన్ లలో కండ్ల కలక విస్థరించింది. ప్రధానంగా హాస్టల్ లలో ఉండే విద్యార్ధులు ఈ అంటు వ్యాధి బారినపడ్డారు. హాస్టల్ లు, స్కూళ్లకు విద్యార్థులకు ఫీవర్ వచ్చి న రావద్దని చెబుతున్నారు. ఆర్ బీఎస్ కే ల ద్వార విద్యార్ధులకు వైద్యసేవలను అందిస్తున్నారు. అదే మాదిరిగా హాస్టల్ లు, కేజీబీవీలు, గురుకులాల్లో ఉండే ఏఎన్ ఎంల ఆధ్వర్యంలో కండ్ల కలకను గుర్తించి వారికి వైద్యసేవలను అందించి పిల్లలను ఇండ్లకు పంపించి వేస్తున్నా రు. జ్వరాలు వచ్చిన హాస్టల్ లను విద్యార్ధులు ఖాళీ చేసి ఇంటి బాటపడుతున్నారు. కండ్ల కలక వల న ఎలాంటి హని జరుగకపోయినప్పటికి నాలు గు ఐదు రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇంటిలో ఓక్కరికి సోకిన మిగి లిన అందరు కుటుంబ సభ్యులను చూట్టేస్తుంది. కండ్ల కలక బారిన పడిన వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే అది ఇతరులకు సోకకుండా నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. కండ్ల కలక అనేది సాధరణ అంటు వ్యాది అని అది సోకినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఓకటి రెండు రోజులలో తగ్గిపోతుందని తెలుపుతున్నారు. ఈ విషయంలో సొంత వైద్యం పనికి రాదని కంటివైద్యులను సంప్రదించి చుక్కల మందులను వాడాలన్నారు. ప్రధానంగా అది సోకిన వారు కళ్ల జోడు వాడాలని సూచనలు చేస్తున్నారు.