జర్నలిజం వృత్తిలో మహిళలు రాణించడం గొప్ప విషయం

శ్రమతో కూడిన క్లిష్టమైన జర్నలిజంలో మహిళలు అద్భుతంగా రాణించడం గొప్ప విషయం అని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు.

Update: 2024-03-06 10:47 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : శ్రమతో కూడిన క్లిష్టమైన జర్నలిజంలో మహిళలు అద్భుతంగా రాణించడం గొప్ప విషయం అని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యవర్గ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా నగర మేయర్ దండు నీతు కిరణ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అంతడుపుల రామకృష్ణ, బైర శేఖర్ లు గౌరవంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతడుపుల రామకృష్ణ మాట్లాడుతూ

     ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి పండగ ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా జర్నలిస్ట్ సోదరీమణులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ సాహసోపీతమైన క్లిష్టమైన జర్నలిజం వృత్తిలో మహిళలు అద్భుతంగా రాణిస్తూ ప్రతిభను చాటుతున్నారన్నారు. పురుషులతో సమానంగా వార్తలను సేకరించి సమాజ మార్పుకు కృషి చేస్తున్నారని ఆమె అభినందించారు. అలాగే మహిళలు తమ ఇంటిని ఎలా చక్క పెడతారో, తాము రాసే వార్తలు సమాజ మార్పు కోసం కృషి చేయాలన్నారు.

    ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ మహిళా జర్నలిస్టులు జర్నలిజం వృత్తిలో రాణించడం శుభపరిణామమని, నిజాలను నిర్భయంగా రాసి ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేయాలన్నారు. అనంతరం వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులను కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి సందీప్, సంయుక్త కార్యదర్శి మోహన్ లతోపాటు మహిళా జర్నలిస్టులు సంగీత, లావణ్య, వాణి, ఆశ్ర, సోనీ తదితరులు పాల్గొన్నారు. 


Similar News