సమాచారాన్ని సమగ్రంగా సేకరించాలి

సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే సమగ్రంగా చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎ.శరత్ అన్నారు.

Update: 2024-11-07 10:13 GMT

దిశ, కామారెడ్డి : సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే సమగ్రంగా చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎ.శరత్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి సమగ్ర సర్వేలో పూర్తి సమాచారం సేకరించాలని, సర్వేలో ఆయా కుటుంబాలు అందించే వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సమాచారం ఉంటేనే అభివృద్ధి ప్రణాళికలు చేపట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి టీమ్ రోజుకు కనీసం 15 గృహాలను సర్వే చేయాలని సూచించారు. జిల్లాలో సర్వే కోసం ఏర్పాటు చేసిన ఎన్యుమరేటర్స్, సూపర్వైజర్ ల వివరాలను అంతకుముందు కలెక్టర్ వివరించారు. క్షేత్ర స్థాయిలో సమిష్టిగా పనిచేయడం ద్వారా పనులు వేగంగా పూర్తవుతాయని అన్నారు.

    సర్వేతో పాటు ఆన్లైన్ ఎంట్రీలు కూడా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు అవసరమైన ప్రతిచోటా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పారు. అంతే కాకుండా సన్నవడ్లు కొనుగోలుకు ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించడంతో పాటు ట్యాబ్ ఎంట్రీలు చేయడం ద్వారా ప్రగతి కనబడుతుందని అన్నారు. సెంటర్ లో కొనుగోళ్లు చేసిన ధాన్యంను వెంటనే మిల్లులకు రవాణా చేసేందుకు లారీ ట్రాన్స్ పోర్టర్ల యజమానులతో సమావేశం నిర్వహించాలని కోరారు. ధాన్యం నిల్వ చేసేందుకు రైస్ మిల్లర్లకు సహకరించాలని సూచించారు. రైతులకు అసౌకర్యం కలుగకుండా చూడాలని అన్నారు. మండల స్థాయిల్లో తహసీల్దార్లు సెంటర్లను సందర్శించాలని సూచించారు.

    తొలుత జిల్లాలో కొనుగోలు చేస్తున్న ధాన్యం పంట వివరాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివరిస్తూ జిల్లాలో 423 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో సన్న రకం వడ్ల కొనుగోలుకు 67 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4466 మంది రైతుల నుంచి 30629 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు, లారీల్లో ఆయా రైస్ మిల్లులకు తరలించి, ట్యాబ్ ఎంట్రీ చేస్తున్నట్టు తెలిపారు. గోనె సంచులు, ట్రాన్స్పోర్టేషన్, మిల్లర్ల బ్యాంక్ గ్యారంటీ, రైతులకు చెల్లింపులు తదితర అంశాలపై వివరించారు. అంతకు ముందు కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రత్యేక అధికారి సందర్శించారు.

    రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు పంటను ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఇంటింటి సర్వేలో భాగంగా హౌస్ లిస్టింగ్ తీరును ప్రత్యేక అధికారి, కలెక్టర్ లు సందర్శించి, స్టిక్కర్ పై నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి.విక్టర్, ఆర్డీఓ రంగనాథ్ రావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, సహాయ పౌరసరఫరాల అధికారి నరసింహారావు, జిల్లా సహకార అధికారి రాం మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా ఎస్సీ, గిరిజన సంక్షేమ అధికారిని రజిత, స్థానిక తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, ఇతర అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. 


Similar News