ఇతను నిజంగానే రియల్ బాహుబలి..
బాహుబలి సినిమాలో ప్రభాస్ కేవలం అట్టముక్కల లింగాన్ని లేపుతాడు.
దిశ, గాంధారి : బాహుబలి సినిమాలో ప్రభాస్ కేవలం అట్టముక్కల లింగాన్ని లేపుతాడు. కానీ ఇక్కడ రియల్ బాహుబలి మాత్రం 90 కిలోల బరువైన రాయిని మెడ పై పెట్టుకొని అందరిచే శభాష్ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని చద్మల్ తండాలో మాజీ సర్పంచ్ బంతిలాల్ (45) ప్రతి ఏటా నిర్వహించే బండరాయి ప్రదర్శన ఈసారి కూడా ఎప్పటిలాగే అమర్ సింగ్ నాయక్ ఇంటి వద్ద నిర్వహించారు. కానీ ఈసారి సర్పంచ్ బరిలో దిగి వయసును కూడా లెక్కచేయకుండా బండరాయిని లేపి అందరిచేతే ఔరా అనిపించాడు.
గిరిజన సాంప్రదాయ పండుగలో ఒకటైన హోలీ లేంగీ పండగను శివరాత్రి రోజు నుండి ప్రారంభించి దాదాపు 15 రోజులు నిష్ఠతో ఉండి పున్నమి వచ్చేవరకు ఒక పొద్దు దీక్షతో ఉంటారు. అందులో గిరిజనులు హోలీని మూడు రోజులు జరుపుకొని చివరి రోజు బండరాయి ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇందులో బండరాయం లేపి మెడపై పెట్టుకున్న వారిని సంవత్సరం అంతా పైల్వాన్ గా పిలవబడతారు. ఈ కార్యక్రమంలో రవాణా సమాజ్ అధ్యక్షులు తాన్ సింగ్, ఎంపీటీసీ జగదీష్, సర్పంచ్ ప్రేమ్ సింగ్, రతిరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.