BREAKING: కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం.. తడిసిముద్దైన ఎన్నికల సామాగ్రి

ఉదయం నుండి భానుడి ప్రతాపంతో వేడెక్కిన తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం సాయంత్రానికి రాష్ట్రంలోని పలు

Update: 2024-05-12 11:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉదయం నుండి భానుడి ప్రతాపంతో వేడెక్కిన తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం సాయంత్రానికి రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షం కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో దట్టంగా మబ్బులు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే కామారెడ్డిలో జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం నుండి ఈవీఎంలను నియోజకవర్గాలకు తరలిస్తుండగా ఒక్కసారిగా భారీ వాన కురిసింది. దీంతో టెంట్లు, ఇతర ఎన్నికల సామాగ్రి తడిచిపోయాయి. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, కంట్రోలింగ్ మెషిన్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తోన్న సమయంలో భారీ వర్షం కురవడంతో పోలింగ్ సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. ఎన్నికల సామాగ్రి తడవకుండా చూసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొన్ని చోట్ల ఎన్నికల సిబ్బంది వర్షంలోనే తడుచుకుంటూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. 


Similar News