తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ గా హరూన్ ఖాన్

తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ గా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 13వ డివిజన్ కార్పొరేటర్ హరూన్ ఖాన్ ఎంపికయ్యారు.

Update: 2024-03-12 12:47 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ గా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 13వ డివిజన్ కార్పొరేటర్ హరూన్ ఖాన్ ఎంపికయ్యారు. తెలంగాణ లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల పలు కార్పొరేషన్ లకు కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా నిజామాబాద్ నగరానికి చెందిన కార్పొరేటర్ హరూన్ ఖాన్ ను స్థానిక సంస్థల కోటాలో పీసీబీ బోర్డ్ మెంబర్ గా నియమించారు. తన నియామకానికి కృషి చేసిన

     రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్ అలీకి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్ లకు హరూన్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని 13వ డివిజన్ నుంచి గడిచిన ఎన్నికల్లో హరూన్ ఖాన్ ఎంఐఎం తరపున కార్పొరేటర్ గా గెలిచారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన మొదటి కార్పొరేటర్ కావడంతో హారూన్ ఖాన్ కు కాంగ్రెస్ సముచిత స్థానం కల్పించిందని 13వ డివిజన్ నాయకులు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.


Similar News