జిల్లాలో వడగళ్ల వాన.. ఆందోళనలో రైతులు..

వాతావరణ శాఖ అధికారులు సూచించిన విధంగానే నిజామాబాద్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తూ మరికొన్ని చోట్ల వడగాళ్లు రాళ్ల వర్షం కురుస్తుంది.

Update: 2023-03-18 16:53 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వాతావరణ శాఖ అధికారులు సూచించిన విధంగానే నిజామాబాద్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తూ మరికొన్ని చోట్ల వడగాళ్లు రాళ్ల వర్షం కురుస్తుంది. జిల్లా వ్యాప్తంగా వాతావరణం మబ్బు కుమ్ముకొని చల్లని వాతావరణంతో ఉండడం వల్ల రైతంగం ఆందోళన చెందుతూ చేతికి వచ్చిన పంటనష్టపోయే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా వడగాళ్లతో రాళ్ల వర్షం కురుస్తుండడంతో రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని భీంగల్, డిచ్పల్లి, నందిపేట్ మాక్లూర్, బోధన్ ఆర్మూర్, బాల్కొండ గాంధారి, నిజామాబాద్ రూరల్ తో పాటు వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిపిస్తుంది.

వాతావరణ శాఖ ముందస్తుగా రైతన్నలకు సలహాలు సూచనలు ఇచ్చినప్పటికీ అనుకున్న స్థాయి కన్నా భారీగా వర్షం కురవడంతో పంట నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఉగాది మాసంలో వచ్చే మామిడి పండ్లతో పాటు వివిధ రకాల పండ్లు నేల పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట భారీ వర్షంతో పాటు వడగాళ్లు రాళ్లతో కూడుకున్న వర్షం వల్ల నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతన్నలు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షానికి కరెంటు ఇక్కట్లు అన్ని ఇన్ని కావు. ప్రాంతాలు పిడుగులు పడ్డట్టు సమాచారం.

Tags:    

Similar News