కామారెడ్డి నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ పోటీ చేస్తారు
కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచే మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ పోటీ చేస్తారని, ఇందులో ఏ మాత్రం అనుమానం అక్కర్లేదని టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
దిశ, భిక్కనూరు : కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచే మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ పోటీ చేస్తారని, ఇందులో ఏ మాత్రం అనుమానం అక్కర్లేదని టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా మండలంలోని ఇస్సనపల్లి, భిక్కనూరులలో వేర్వేరుగా కాంగ్రెస్ నాయకులు తిరుగుతూ సిక్స్ గ్యారెంటీస్ పై డోర్ టు డోర్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ షబ్బీర్ అలీని గెలిపిస్తే సోనియా గాంధీ ఇచ్చిన హామీలు నెరవేరుతాయన్నారు. అయితే కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ పోటీ చేయడం లేదన్న ప్రచారం జరుగుతుందన్న విషయాన్ని గ్రామ ప్రజలు ప్రశ్నించగా ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ
కేవలం సీఎం కేసీఆర్ కుట్రలో భాగమేనని ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి, పదవిలో ఉన్నా లేకున్నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్న ఆయన ఇక్కడి నుంచే తప్పకుండా పోటీ చేస్తారని చెబుతూ ఓట్లు అభ్యర్థించారు. షబ్బీర్ అలీ చేతిలో కేసీఆర్ ఓటమిపాలవు తా రన్న భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపరి భీంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, బీసీ సెల్ జిల్లా నాయకులు వడ్ల తిర్మల్ స్వామి, పట్టణ పార్టీ అధ్యక్షులు అందె దయాకర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు తాటిపాముల సిద్దా గౌడ్, సొసైటీ డైరెక్టర్ మహమ్మద్ సాజిద్, చాకలి రవి, నీల అంజయ్య, గజ్జె నాగులు, కల్లూరి సిద్ధ రాములు తదితరులు పాల్గొన్నారు.