'రైతులకు ఏం చేశారని రైతు దినోత్సవం పేరిట సంబరాలు..'
రైతులకు రుణమాఫీ చేసినందుక, 2018 ఎన్నికల్లో ఉచిత ఎరువులు ఇస్తాం అన్న హామీ నెరవేర్చినందుక రైతు దినోత్సవ సంబరాలు.
దిశ, ఆర్మూర్ : రైతులకు రుణమాఫీ చేసినందుక, 2018 ఎన్నికల్లో ఉచిత ఎరువులు ఇస్తాం అన్న హామీ నెరవేర్చినందుక, మోర్తడ్ సభలో చెప్పినట్లు మహిళ సంఘాల ద్వారా పసుపు, మక్కా, ఎర్రజొన్న కొనుగోలు చేసినందుక, ఆర్మూర్ ని సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా మార్చినందుకా రైతు దినోత్సవం పేరిట సంబరాలు జరిపేది అని కాంగ్రెస్ ఆర్మూర్ పట్టణ నాయకుడు కోల వెంకటేష్ అన్నారు. శనివారం ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో విలేకరుల సమావేశంలో కోల వెంకటేష్ మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి రైతు దినోత్సవం సంబరాలు జరుపుతున్నారని, అసలు సంబరాలు జరిపేందుకు ఏం అర్హత ఉందని మండిపడ్డారు. ధరణితో రైతులను ముప్పతిప్పలు పెడుతూ వారిని తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వారి భూమి పై వారికే హక్కు లేకుండా చేసినందుక ఉత్సవాలు అని అన్నారు.
రైతుల వరి ధాన్యం కల్లాలలో, రోడ్ల పైన అలానే ఉన్నాయని, రైస్ మిల్లర్లు లారిలో నుండి ధాన్యం దించుకోకుండ రైతుల ధాన్యంలో 10 కిలోల కడతా తీస్తుంటే మీ ప్రభుత్వం ఏమి చేస్తోంది అని ప్రశ్నించారు. ప్రభుత్వం రుణమాఫీ చెయ్యక బ్యాంకర్లు రైతుల ఖాతాల్లో పడ్డ ధాన్యం డబ్బులు, రైతు బంధు డబ్బులు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరిచ్చే రైతుబందు వల్ల ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు. ఈ పథకం ఎలా ఉందంటే దారి వెంట కొందరు దొంగలు దారిలో వెళ్లే పాదచారుల ముందు ఒక వంద రూపాయల నోటు పడేసి వారు ఆ నోటు తీసుకోడానికి వంగే లోపు వెనక నుండి వారి పర్సు కొట్టేసే చందంగా ఉందన్నారు. రైతుబందు ఇచ్చి విత్తన సబ్సిడీ ఎత్తేసారు అని, డ్రిప్ ఇరిగేశన్, వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ, క్రాప్ లోన్ పై వడ్డీ రాయితీ, ఇన్ పుట్ సబ్సిడీ ఎత్తేశారని అన్నారు.
అకాల వర్షాలకు, వరదలకు పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదు అని అన్నారు. రైతు భీమా అవసరం లేదు అని పంటలకు మద్దతు ధర ఇస్తే రైతులే కోటి రూపాయల పాలసి చేసుకుంటారని అన్నారు. రైతు సమన్వయ కమిటీలు ఏరోజు కూడ రైతుల సమస్యల పై చర్చించి దాఖలలు లేవు అని, రైతు వేదికలు అకతాయిలకు వేదికగా మారాయి అని, ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నాలుగేళ్లుగా పాలకవర్గం లేదు అని రైతులకు ఎలా న్యాయం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతం అయినా ఆర్మూర్ నియోజక వర్గంలో కొత్తగా ఒక్క ఎత్తిపోతల పథకం కూడ పూర్తి చేయలేదు అని, పాత వాటికి మరమ్మత్తులకు నిధులు ఇవ్వడం లేదు అన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చెయ్యలేదని అన్నారు.
రైతులకు పంటలకు మద్దత్తు ధర కోసం రోడ్డెక్కి ధర్నలు చేస్తే వారిపై కేసులు పెట్టి జైల్లో పెట్టిన చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ది అని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏక కాలంలో రుణమాఫీ చేసింది అని, రైతులకు ఉచిత కరెంటు ప్రవేశ పెట్టింది అని, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిది అని తొమ్మిదేల్ల టిఆర్ఎస్ పాలనలో రైతులకు చేసింది ఏమి లేదు అన్నారు. రైతులకు ఎం చేశారని సంబురాలు చేస్తున్నారని అన్నారు. ఎవరైనా సంబరాలకు అర్హులు ఉన్నారు అంటే అది ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబం మాత్రమే అని అన్నారు.
జీవన్ రెడ్డి 100కు పైగా ఎకరాలకు వ్యవసాయం చేయకున్నా రైతుబందు పొందుతున్నాడు అని, ఆయన సతీమణికి నిజామాబాద్ డీసీసీబీ సహకార బ్యాంకులో 29,89,107 రూపాయల వ్యవసాయం లోన్ పొందింది అని సాధారణ రైతులకు లక్ష రూపాయల రుణం పొందటమే గగనంగా ఉంది అని అన్నారు. ఏ విధంగా అయిన సంబరాలుకు అర్హులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీర్ మాజీద్, రవికాంత్ రెడ్డి, మందుల పోశెట్టి, బట్టు శంకర్, హబీబ్, మీసాల రవి, బాలకిషన్, పెద్ద పోశెట్టి పాల్గొన్నారు.