అడ్డు తగిలితే అంతు చూస్తా.. ఎక్సైజ్ కాంట్రాక్టర్
గౌడ కులస్తులకు అన్యాయం జరుగుతుందని ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందర మాజీ ఎంపీటీసీ కర్ణం కృష్ణ గౌడ్ శుక్రవారం న్యాయపోరాటానికి దిగారు.
దిశ, ఆర్మూర్ : గౌడ కులస్తులకు అన్యాయం జరుగుతుందని ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందర మాజీ ఎంపీటీసీ కర్ణం కృష్ణ గౌడ్ శుక్రవారం న్యాయపోరాటానికి దిగారు. పూర్తి వివరాల ప్రకారం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా ఎక్సైజ్ కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ఎక్సైజ్ అధికారులను మచ్చిక చేసుకున్నాడు. దీంతో రెచ్చిపోయి ఇష్టానుసారంగా టీఎఫ్ సీ లైసెన్స్ మెంబర్లను బెదిరించి భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. సభ్యులకు సరైన డబ్బులు ఇవ్వకుండా కళ్ళు మామూలు వసూలు చేసుకుంటున్నాడు.
ఈ మాఫియాపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కరణం కృష్ణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 20 సంవత్సరాల క్రితం 3 రూపాయలు కళ్ళు సీసా ఉన్నప్పుడు 40 వేల రూపాయలు ఇచ్చేవారు. ప్రస్తుతం 20 రూపాయలకు కల్లుసీసా ఉంట్టే 30వేల రూపాయలు మాత్రమే చెల్లెస్తున్నారు. ఇదేంటీ అని అడుగితే భయబ్రాంతులకు గురి చేస్తూనరని వారు వాపోయారు. ఈ కాంట్రాక్టు సదురు వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి ఇస్తే 3 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సదురు కాంట్రాక్టర్ కు భయపడి ముందుకు రావాలి అంటే ప్రతి ఒక్కరు భయపడి జంకుతున్నారని అన్నారు.