జాతీయ స్థాయి క్రీడా పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపిక

ఖమ్మం జిల్లా బోనకల్లునందు నిర్వహించిన 67వ తెలంగాణ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ... District athletes are selected for national level sports competitions

Update: 2023-03-30 10:09 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: ఖమ్మం జిల్లా బోనకల్లునందు నిర్వహించిన 67వ తెలంగాణ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర జట్టుకు సన్నదత శిబిరానికి ఎంపిక చేయడం జరిగిందని జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి బి. శ్యామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు హైదరాబాదులోని ఏఎస్ రావు నగర్ మారుతి బాల్ బ్యాడ్మింటన్ గ్రౌండ్స్ లో శిక్షణ శిబిరం నిర్వహించి ఇందులో నుండి ప్రతిభ కలిగిన క్రీడాకారులను తెలంగాణ జట్టుకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు శశిధర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కామారెడ్డి, సాయి, శివ, గిరిరాజ్ కాలేజీ నిజామాబాద్, యు. శివానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మోర్తాడ్, దీపిక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మోర్తాడ్ క్రీడాకారులు తెలంగాణ జట్టుకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు మార్చి 31వ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగే 67వ జాతీయస్థాయి జూనియర్ బాల్ బ్యాట్మింటన్ క్రీడా పోటీలకు తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఎంపిక కావటం పట్ల జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు మానస గణేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ, సలహాదారులు హనుమంత్ రెడ్డి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, ఉపాధ్యక్షులు కిషన్, కిషోర్, రంజిత్, రాజ్ కుమార్, కోశాధికారి రాజేశ్వర్, కృష్ణమూర్తి, సంఘ సభ్యులు సురేందర్, నాగేష్ వినోద్, సంజీవ్ సురేష్, శ్రుపాన్, సాయిబాబా, మాధురి, భాగ్యశ్రీ, స్వప్న, భాగ్యలు అభినందించారని తెలిపారు.



Tags:    

Similar News