వాస్తవాలను ఎప్పటికప్పుడు రాస్తున్న దిశ

వాస్తవాలను ఎప్పటికప్పుడు రాస్తున్న పత్రిక దిశ దినపత్రిక అని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అన్నారు.

Update: 2025-01-04 11:37 GMT

దిశ, ఆలూర్ :వాస్తవాలను ఎప్పటికప్పుడు రాస్తున్న పత్రిక దిశ దినపత్రిక అని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అన్నారు. అదేవిధంగా వార్తలను వేగవంతంగా అందించడంలో దిశ పత్రిక ముందుందని అన్నారు. 2025 దిశ నూతన సంవత్సర కాలెండర్ ను ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో శనివారం ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ దిశ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ మాట్లాడుతూ..పత్రిక రంగంలో దిశ పత్రిక ప్రభంజనం సృష్టించి, పోటీపత్రికలను తలదన్నే రీతిలో ముందుకు వెళుతుందని, ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టుగా, వార్తలు రాసే విషయంలో నో కాంప్రమైజ్ అనే ధోరణిలో దిశ పత్రిక ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ దిశ దినపత్రిక ఇన్చార్జ్ ఇట్టేడి మోహన్ రెడ్డి,ఆలూరు రిపోర్టర్ అమందు సంజీవ్, నందిపేట్ రిపోర్టర్ వినోద్ లు పాల్గొన్నారు.


Similar News