వన్య ప్రాణుల బెడద... అన్నదాతల వ్యధ
మండలంలోని సంతాయిపేట గ్రామశివారు ప్రాంతంలో రైతుపండించిన పంటపొలంలో దుప్పులు సంచరించి పంటను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిశ, తాడ్వాయి : మండలంలోని సంతాయిపేట గ్రామశివారు ప్రాంతంలో రైతుపండించిన పంటపొలంలో దుప్పులు సంచరించి పంటను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్ష భీబత్సవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రైతులు పంటపొలాల్లో వన్యప్రాణులు సంచరించడంతో కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. దుప్పులు, ఇతర జంతువులు పంట చేలలో చొరబడి విధ్వంసం సృష్టిస్తూ తీరని నష్టాన్ని మిగిలిస్తున్నాయని రైతులు.
పంట పొలాలచుట్టూ అడవి విస్తరించి ఉండడంతో పంటపొలాల మీదకు రాకుండా ఫారెస్ట్ అధికారులు ఫెన్సింగ్ వేయడంలో వాటిని సంరక్షించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే భావన అక్కడి రైతుల్లో ఉంది. ఇకనైనా పంట చేనులోకి రాకుండా అటవీ అధికారులు తగుచర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇదే విషయమై దిశప్రతినిధి అటవీ అధికారులను వివరణ కోరగా మాకు రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని అన్నారు. పంటనష్టం జరిగిందని రైతులు మా ద్రుష్టికి తీసుకుని వస్తే మా పై అధికారుల ద్రుష్టికి పంపించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.