ఆలయాల్లో భక్తుల సందడి

నూతన సంవత్సరం ఆరంభమైన సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

Update: 2025-01-01 15:54 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ జనవరి 01: నూతన సంవత్సరం ఆరంభమైన సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున దేవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తే..ఏడాది అంతా ఎలాంటి ఆటంకాలు, కష్టాలు లేకుండా గడిచిపోతుందనే నమ్మకంతో దేవుడిని దర్శించుకోడానికి ఆలయాలకు వెళ్లారు. తమ పేర్లపై ప్రత్యేక అర్చనలు జరిపించుకుని ఆశీర్వచనాలు పొందారు. నిజామామాద్ జిల్లాలోని లింబాద్రి గుట్ట నర్సింహా స్వామి, శ్రీ నీలకంటేశ్వరాలయం, మాధవ నగర్, అమీనాపూర్ సాయిబాబా ఆలయాలు, ఉత్తర తిరుపతి, అపురూప వెంకటేశ్వర ఆలయం, ఆర్మూర్ లోని సిద్ధుల గుట్ట, కామారెడ్ది జిల్లాలోని భిక్కనూరులోని సిద్దరామాలయం తదితర ప్రధాన ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది. 


Similar News