చెరుకు రైతులతో కలెక్టర్ చర్చలు

ఎన్ సీఎస్ ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి ప్రభుత్వమే నడపాలని రైతులు, చెరుకు ఉత్పత్తిదారుల సంఘాలతో ఉద్యమం నడుస్తుంది.

Update: 2024-03-07 12:58 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎన్ సీఎస్ ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి ప్రభుత్వమే నడపాలని రైతులు, చెరుకు ఉత్పత్తిదారుల సంఘాలతో ఉద్యమం నడుస్తుంది. మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యేలకు ఈమేరకు వినతి పత్రాలు ఇచ్చారు. ఫ్యాక్టరీ పై పూర్తి వివరాలు సేకరించి తమకు అందజేయాలని చెరుకు ఫ్యాక్టరీల పునరుద్ధరణ కమిటీ చైర్మన్, మంత్రి డాక్టర్ శ్రీధర్ బాబు కలెక్టర్ ను ఆదేశించారు. దాంతో గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఛాంబర్ లో రైతు ప్రతినిధులు, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులతో చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక సహకార రంగంలో కొనసాగిన ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్

    చక్కెర ఫ్యాక్టరీ మాత్రమే ఉందని, ఇది 1964 సంవత్సరంలో ప్రారంభమై మంచి లాభాలతో నడిచి వేలాది మంది రైతులను, కార్మికులకు మంచి ఉపాధి లభించింది అని రైతు నాయకులు తెలిపారు. ఇదే కాకుండా జిల్లాలో వరి, చెరుకు పంట పై ప్రధానంగా రైతులు ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. 2008లో ఫాయక్టరీ మూతపడిందని వివరించారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీని తెరిపించి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి రైతుల బతుకుల్లో వెలుగులు నింపాలని కలెక్టర్ ని కోరారు. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిస్తానని కలెక్టర్​ తెలిపారు. ఈ చర్చల్లో రైతు ప్రతినిధులు, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య, బి. లక్ష్మారెడ్డి, బొడ్డు గంగారెడ్డి , అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, మచ్చర్ల నాగయ్య , ఆర్. పృథ్వీరాజ్ , రెడ్డి శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు. 


Similar News