ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ నిజామాబాద్ మెడికల్ కళాశాల

ఆత్మహత్యలకు నిజామాబాద్ మెడికల్ కళాశాల అడ్డాగా నిలుస్తుంది.

Update: 2024-05-17 13:13 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : ఆత్మహత్యలకు నిజామాబాద్ మెడికల్ కళాశాల అడ్డాగా నిలుస్తుంది. విలువైన ప్రాణాలు కాపాడాల్సిన జూనియర్ డాక్టర్లు క్షణికావేశంలో తనువులు చాలిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మెడికల్ కాలేజీలో ఆత్మహత్య ఘటనలు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో ఈసారి మరో జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.

    అయితే మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఇతర పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగానే తరచుగా ఇలాంటి ఘటనలు నిజామాబాద్ మెడికల్ కళాశాలలో పునరావృతం అవుతున్నాయనే విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలో మహిళా జూనియర్ డాక్టర్ గత రెండు రోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేసినట్టు విశ్వనీయంగా తెలిసింది. కాగా మరోపక్క జూనియర్ డాక్టర్ కుటుంబ కలహాల వల్ల మనస్థాపంకు గురై రెండు రోజులక్రితం నిద్ర మాత్రలు మింగడం వల్ల అపస్మార స్థితిలోకి వెళ్లిందని కాలేజీ సిబ్బంది పేర్కొంటుంది. అదే రూమ్ లో ఉన్న మిగతా జూనియర్ డాక్టర్లు గమనించి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఇంకా అపస్మారక స్థితిలోనే ఉంది. ఆమెకు స్పృహలోకి వస్తే అసలు విషయం బయటపడుతుంది. 


Similar News